టంగుటూరులో రెచ్చిపోయిన దొంగలు

టంగుటూరులో దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన దీనదాసు ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది. బాధితులు వ్యక్తిగత పనులపై నిమ్మకూరుకు వెళ్లిన సమయంలోఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువా పగలగొట్టి నాలుగు సవర్ల బంగారం దోచుకు వెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్