ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లిలో గొట్టిపాటి ఉమా మహేశ్వరరావుకు చెందిన పొగాకు బ్యారన్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బ్యారన్ పూర్తిగా కాలిపోయింది. బ్యారన్లో సుమారు రూ. 4 లక్షల విలువైన పొగాకు కర్ర ఉందని రైతు మహేశ్వరరావు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.