మాజీ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం సింగరాయకొండకు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు శానంపూడి రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం కొండేపిలో జరుగనున్న వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరవుతారు. రోజా వచ్చేపటికే ఆమెకు స్వాగతం పలికేందుకు వైసీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.