ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామ సమీపంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారులు రాంగ్ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు.