ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలో పేకాట ఆడుతున్న 13 మందిని స్థానిక పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13,370 నగదు, ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని, వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు హెచ్చరించారు.