టిడిపిలో చేరిన 15 కుటుంబాలు

పొదిలి మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మంగళవారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మార్కాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి సమక్షంలో ఈ చేరిక జరిగింది. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్