ఇరు వర్గాల దాడి.. నలుగురికి గాయాలు

మార్కాపురం మండలంలోని గొట్టిపడియ గ్రామంలో శనివారం రాత్రి డబ్బుల వివాదంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేల్పుల కోటిరెడ్డి వద్ద డబ్బులు తీసుకున్న నలుగురు వ్యక్తులు వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో కోటిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. శ్రీరామనవమి రోజున వారు కోటిరెడ్డితో పాటు ఆయన కుమారుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. మార్కాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్