ఊరికి వెళ్తున్నారా జాగ్రత్త: మార్కాపురం ఇన్ఛార్జ్ ఎస్పీ

సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ సమయంలో చాలామంది విహారయాత్రలు, బంధువుల ఇండ్లకు వెళ్తారని, ఈ అవకాశాన్ని దొంగలు ఉపయోగించుకుంటారని ఆయన హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాలు, డిజిటల్ డోర్ లాక్స్, మొబైల్ అలర్ట్ సిస్టమ్స్ వంటివి ఉపయోగించడం ద్వారా భద్రతను మెరుగుపరచుకోవచ్చని సూచించారు. ప్రయాణానికి ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్