గిద్దలూరులో మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక వైసిపి నాయకులు కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మళ్లీ గిద్దలూరు నుంచి అన్న వెంకట రాంబాబు పోటీ చేస్తే బాగుంటుందని వైసీపీ నాయకులు అన్నారు. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.