మార్కాపురం జిల్లా కేంద్రంలోని చెన్నకేశవస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు మూసివేశారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రధానార్చకులు అప్పనాచార్యులు ఆలయాన్ని మూసివేసి భక్తులకు సూచనలు చేశారు. గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఇష్టదైవాన్ని ఆరాధించాలని, బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.