సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో బుధవారం స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల ముందు మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మార్కాపురం జిల్లాగా ప్రకటించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని కూటమి నాయకులు తెలిపారు. మార్కాపురం జిల్లా సాధించిన ఎమ్మెల్యే నారాయణరెడ్డికి కూడా తాము రుణపడి ఉన్నామని కార్యకర్తలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్