మార్కాపురం జిల్లాగా ప్రకటించి ఏర్పాటుచేసిన సీఎం చంద్రబాబుకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని మార్కాపురం పట్టణంలోని 9వ వార్డు ఎన్డీఏ కూటమి నాయకులు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలకు కార్యకర్తలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కూడా సీఎం చంద్రబాబుతోనే పూర్తవుతుందని వారు అన్నారు.