మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన 14 మంది మృతదేహాల గుర్తింపు డీఎన్ఏ పరీక్షల ద్వారా శనివారం ఉదయానికి పూర్తయింది. విజయవాడ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా, మార్కాపురం వైద్యశాల వద్ద అధికారులు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. అనంతరం 12 అంబులెన్సుల ద్వారా మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరలించింది. ఈ దుర్ఘటనతో బాధితుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.