మార్కాపురం పూల సుబ్బయ్య కాలనీ కోయశాఖ సిపిఐ మాజీ కార్యదర్శి దుద్దుకూరి మంతయ్య (80) అనారోగ్యంతో గురువారం తన నివాసంలో మృతి చెందారు. ఆయన గతంలో పూల సుబ్బయ్య కాలనీ ఏర్పాటులో కృషి చేశారు. కోయజాతి ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేశారు. స్వర్గీయ సిపిఐ నాయకుడు పూల సుబ్బయ్య కు ప్రధాన అనుచరుడిగా సుదీర్ఘకాలం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయనకు అయిదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.