పెరిగిన ఇంధన, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలకు నిరసనగా జూన్ 9న సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సోమయ్య నారాయణ తెలిపారు. మార్కాపురం పూల సుబ్బయ్య శాంతిభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, ప్రజలపై గణనీయంగా పన్నుల భారం మోపిందని పేర్కొన్నారు.