గుర్తు తెలియని వ్యక్తి మృతి

మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్ సమీపంలోని సగ్గులేరు వాగు రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించిన రైల్వే పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, రైలు నుంచి జారిపడ్డాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయం విచారణలో తేలాల్సి ఉందని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్