మార్కాపురం జిల్లా ప్రెస్ క్లబ్లో ఏఐటీయూసీ ఏరియా మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసిన్, సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ, ఏప్రిల్ 1వ తేదీని బ్లాక్ డేగా పాటిస్తున్నట్లు తెలిపారు.