ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు తెలియజేయడానికి 9959225700కు ఫోన్ చేయవచ్చన్నారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే ఉత్తమమన్నారు.