టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలంలోని మొగల్లూరు గ్రామపంచాయతీలో శుక్రవారం టిడిపి నాయకులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నరసింహనాయుడు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్ నగదును అందజేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్