అద్దె భవనాల్లో వసతి గృహాలు

మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అద్దె భవనాల్లోనే విద్యార్థులు ఉంటున్నారు. సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ బాలుర హాస్టల్ కూడా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. ఇప్పటికైనా వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్