దోర్నాల–శ్రీశైలం ఘాట్ రోడ్డులోని బోడేనాయక్ తాండ సమీపంలో సోమవారం RTC బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తునికి చెందిన అశోక్ అనే యువకుడు గాయపడ్డాడు. అతన్ని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శ్రీశైలం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో చితికిన కాలి బొటన వేలును తొలగించినట్లు వైద్యులు తెలిపారు.