మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో గురువారం రాత్రి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని, వాహనదారులు మద్యం తాగకుండా వాహనాలు నడపాలని మాధవరావు సూచించారు.