ఎక్స్కవేటర్ బోల్తా

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లె ఘాట్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎక్స్కవేటర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో సుమారు 2 గంటల పాటు రోడ్డుపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొదిలి నుంచి కంభం వైపు వస్తున్న ఎక్స్కవేటర్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎక్స్కవేటర్ ను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్