పన్ను వడ్డీ పై మినహాయింపు

మార్కాపురం పురపాలక సంఘ పరిధిలో ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం మాఫీని పొడిగించినట్లు కమిషనర్ నారాయణరావు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాత బకాయిలు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందుగానే పూర్తిగా చెల్లిస్తే 5 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ అవకాశాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్