ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో మిరపకాయలు ఆరబెట్టేందుకు వెళ్ళిన రైతు చంద్రశేఖర్ రెడ్డి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో రైతు కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.