విద్యా ప్రమాణాలను పెంచుటకు ముగింపు పోటీలు

మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు జీఎఫ్ఎల్ఎన్ ముగింపు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి దోహదపడుతుందని ముఖ్య అతిథులు ఎమ్మార్వో చిరంజీవి, ఎంపీడీవో బాల చెన్నయ్య, ఎంఈవో రాందాస్ నాయక్ పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్