ప్రకాశం జిల్లా కొనకనమిట్ల సమీపంలోని మార్కాపురం ఒంగోలు హైవేపై శుక్రవారం మధ్యాహ్నం కారు, స్కూల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన ఎస్సై శ్రీకాంత్, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.