మార్కాపురం పట్టణంలో ఘరానా చోరీ

మంగళవారం రాత్రి మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ నగర్ లో తిప్పిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలతో పాటు రూ. 25 వేల నగదును అపహరించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. బుధవారం ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు జరిగిన దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్