ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విజయోత్సవ ర్యాలీ

మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ ఛైర్మన్ పటాన్ నాగూర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని, ఇటీవల విడుదలైన ఫలితాలే దీనికి నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్