ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 2 లక్షలు తీసుకున్న మోసగాడిని తాట తీయండి అంటూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆదివారం ఆదేశించారు. పొదిలి మండలం చిదంబరంపల్లెకి చెందిన ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నగదు కాజేసిన వ్యక్తిని పిలిపించి బాధితులకు వారి డబ్బులు వారికి ఇప్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.