మార్కాపురంలో మోస్తారు వర్షం

మార్కాపురం పట్టణంలో ఆదివారం వాతావరణం మారి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ, సాయంత్రం ఒక్కసారిగా కారు మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. గత కొద్దిరోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. చల్లని గాలుల వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్