తర్లుపాడులో భారీ వర్షం

మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. మార్కాపురం, తర్లుపాడు గ్రామాల మధ్య రహదారిపై వర్షపు నీరు ఆలుగు పారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం, చల్లటి గాలులు ఉపశమనం కలిగించాయి. వాతావరణ శాఖ రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్