ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు, గంజాయి వంటివి నిర్మూలించేందుకు జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో దుకాణాలను తనిఖీ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా పాఠశాలలు కళాశాలల వద్ద ఉన్న దుకాణాలను మరింత పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని పోలీసులు హెచ్చరించారు.