మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల స్కూల్ విద్యార్థుల ఆటో ప్రమాదానికి గురవగా, తాజాగా రెండు ఆటోలు ఢీకొని పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా, ఓవర్లోడింగ్, వేగ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నారు.