మార్కాపురం అధ్యక్షుడిగా కాశీనాథ్..?

జనసేన పార్టీ మార్కాపురం జిల్లా అధ్యక్షుడిగా ఇమ్మడి కాశీనాథ్ ను నియమించేందుకు పార్టీ నాయకత్వం పరిశీలన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన కాశీనాథ్ ఫోటో వైరల్ అయింది. కాశీనాథ్ జిల్లా కేంద్రంలో సొంత నిధులతో జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పదవికి కాశీనాథ్ తో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్