కొనకనమిట్ల మండలం చిన్నారి కట్ల సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. పెద్దారికట్ల నుంచి మునగపాడుకు కూలీలను తరలిస్తుండగా, పందులు అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆటోలో 15 మంది కూలీలు ఉండగా, గాయపడిన వారిని కొనకనమిట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.