మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం కోనకనమిట్ల మండలంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మేము మోసం చేశామని రోడ్ ఎక్కడమేమిటని మాజీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.