ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో కొద్దిరోజులుగా పిచ్చికుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే 40 మందిపై పిచ్చికుక్కలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. బాధితులు మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చికుక్కల స్వైరవిహారంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి పిచ్చికుక్కలను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.