మార్కాపురం-తర్లుపాడు రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రిక్షా తొక్కుతున్న పగడాల వెంకటేశ్వర్లు (60) అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. తర్లుపాడు నుంచి వస్తున్న కారు రిక్షాను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడిని మొదట స్థానిక వైద్యశాలకు తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు మార్కాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.