రాష్ట్ర అభివృద్ధికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 4వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు భవిష్యత్తులో అందించే పథకాలను ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రజలకు వివరించారు.