మార్కాపురంలోని 7వ వార్డులో ఆదివారం సీఎం చంద్రబాబు చిత్రపటానికి విద్యార్థుల తల్లులు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లుల ఖాతాలోకి నగదు జమ చేయడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి వసంత లక్ష్మి పాల్గొన్నారు. సీఎం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం ఇస్తామని మాట నిలబెట్టుకున్నామని వసంత లక్ష్మి అన్నారు.