ఖరీఫ్-2025 ఈ-పంట డిజిటల్ సర్వే పూర్తి పారదర్శకంగా జరగాలని మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి శుక్రవారం సూచించారు. తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు, వీఏఏలకు శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి విధివిధానాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో డీటీ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి బుజ్జిబాయి పాల్గొన్నారు.