ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని దోర్నాల బస్టాండ్ సమీపంలో జూలై 30వ తేదీన ఆటో ఢీకొని ఏసమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. అంతకు ముందు ప్రమాదంలో గాయపడ్డ ఏసమ్మ ను మార్కాపురంలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఏసన్న మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.