ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిసర ప్రాంతాలలో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులకు ఆదివారం స్థానిక ఎస్సై రాజ మోహన్ రావు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకుండా వాహన సంబంధిత ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మందికి జరిమానా విధించినట్లు ఎస్సై వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వాహనదారులు సహకరించాలన్నారు.