మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్న వెంకట రాంబాబుకు గిద్దలూరు నియోజకవర్గంలో అభిమానులు నీరాజనం పట్టారు. గతంలో గిద్దలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అన్న వెంకట రాంబాబు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికలలో మార్కాపురం నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. శుక్రవారం ఉన్న వెంకట రాంబాబు పుట్టినరోజు కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.