మార్కాపురం: ఈదురుగాలులకు కొట్టుకుపోయిన టోల్‌ప్లాజా, పెను ప్రమాదం తప్పింది

మార్కాపురం జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో బీభత్సం సృష్టించాయి. త్రిపురాంతకం మండలంలో మేడపి సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న భారీ టోల్‌ప్లాజా ఈదురు గాలుల తాకిడికి తట్టుకోలేక గాల్లోకి ఎగిరి సుమారు వంద మీటర్ల దూరం కొట్టుకుపోయి నేలకూలింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టోల్‌ప్లాజా సిబ్బంది కూడా అప్రమత్తమై బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. టోల్‌ప్లాజా జాతీయ రహదారికి అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్