మార్కాపురం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రూ. కోటి 8 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వారికి అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.