ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు ప్రతి నెలా ఒకటవ తేదీన ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోవద్దని లబ్ధిదారులకు సూచించారు.