మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరం గ్రామంలో పెద్దల పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఎలక్ట్రికల్ ప్రభ వద్దకు ఎమ్మెల్యే నారాయణరెడ్డి విచ్చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయతో మార్కాపురం జిల్లా సాధించామని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని ఆయన తెలిపారు.