ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో, మంగళవారం సాయంత్రం దోర్నాలలో వర్షం కురిసింది. రోజంతా తీవ్ర ఎండ వేడితో అల్లాడిన ప్రజలకు ఈ వాన ఉపశమనాన్ని ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.